విలీనంపై షర్మిలకు సీతక్క సవాల్: కోదండరాంపై రేవూరి

తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరి ఇప్పటికే చెప్పారని ఆమె అన్నారు. 2008లోనే తాము తెలంగాణకు అనుకూలమని లేఖ రాసిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. తెలంగాణపై స్పష్టతతో ఉన్న చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు. బాబు పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఆమె చెప్పారు.
జగన్ గురించి కోదండ, టిఆర్ఎస్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జెఏసి తమ పార్టీ అధినేత యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నాయని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోదండరామ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేవలం కొన్ని పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే కోదండరామ్ తమ పార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.
తెలంగాణ జెఏసి కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు అయిందన్నారు. తమ పార్టీ అధినేత గతంలోనే లేఖ రాశారని, తాము దానిని వెనక్కి తీసుకోలేదని చెప్పారు. కాగా తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి బ్రాంచ్ ఆఫీస్‌లా పని చేస్తోందని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.












Click it and Unblock the Notifications