బాబు స్పష్టంగా చెప్పారు: కోదండరాంకు మోత్కుపల్లి

తెలంగాణకు అన్యాయం చేసింది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెల రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేసి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును అడ్డుకుంటామని చెబుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మొదట కెసిఆర్, కాంగ్రెసులను నిలదీయాలన్నారు. బాబు వైఖరి తెలంగాణపై స్పష్టంగా ఉందన్నారు. అలాంటప్పుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
కెసిఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం బాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. కెసిఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ పేరుతో లబ్ధి పొందుతుందన్నారు. జెఏసి కేవలం టిడిపిని మాత్రమే టార్గెట్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం కోసం టిఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. దసరాకు తెలంగాణ వస్తుందని కెసిఆర్ చెప్పారని ఆయనని నిలదీయాలని కోదండకు సూచించారు.












Click it and Unblock the Notifications