సిఎంను అవుతా: బాబు, షర్మిల నల్ల బ్యాడ్జిపై కామెంట్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎత్తివేస్తే ఆయన తన పార్టీని కాంగ్రెసులో కలపడం ఖాయమన్నారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని, ప్రజల కష్టాలు తీరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమే తన కుటుంబమని, ప్రజలే తన కుటుంబ సభ్యులు అన్నారు. కొందరు నల్ల బ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తున్నారని, వారి నల్ల ధనాన్ని కాపాడుకునేందుకు అలా యాత్ర చేస్తున్నారని షర్మిలను ఉద్దేశించి అన్నారు.
తన యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్పలేక పోటీ యాత్ర చేశారని మండిపడ్డారు. జగన్ తప్పులేమీ చేయకుండానే జైలులో కూర్చున్నారా అని ప్రశ్నించారు. తాను దాదాపు అన్ని పదవులూ చేశానని, వాటిపై అనురక్తి లేదని, ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు వస్తున్నాయని, రాష్ట్రంలో మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగు వర్గాలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, తాను మళ్లీ సిఎంనై వారందరి కష్టాలు తీరుస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్ల పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
వైయస్ పాలనల రాష్ట్రం కుప్పకూలిందన్నారు. ఈ సందర్భంగా కంపాడులో చంద్రబాబు కొర్ర పంటను కోశారు. ఉల్లి పంటను తీశారు. సజ్జలను సంచీల్లోకి పోశారు. డ్రమ్స్ వాయించారు. వికలాంగులతో ముచ్చటించారు. కాగా, కాళ్లనొప్పితో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ట, చిన్న అల్లుడు శ్రీనివాసరావు, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వచ్చారు. చంద్రబాబు వెంట లోకేష్, శ్రీనివాస రావు కాసేపు నడిచారు.












Click it and Unblock the Notifications