జగన్‌ను జైల్‌నుండి బయటకి రాకుండా ఆపలేరు: షర్మిల

ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, అలాగే తన సోదరుడు జగన్ జైలు నుండి బయటకి రాకుండా ఎవరూ ఆపలేరన్నారు. జగన్‌కు బెయిల్ వస్తుందని కోట్లాదిమంది ప్రజలు ఎదురు చూశారని కానీ టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై బెయిల్ రాకుండా చేశాయని ఆరోపించారు. దేవుడు, న్యాయం జగన్ వెంట ఉన్నాయని, త్వరలోనే జగన్ బయటకు వచ్చి అందరికీ న్యాయం చేస్తాడన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నట్లు నటిస్తోందని, అలాంటి దాన్ని నిద్రలేపలేమని, రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. వైయస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి గుండె జగనన్నను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సోనియా కుటుంబానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముప్పై ఏళ్లు సేవ చేసి, ప్రతి పథకానికి ఆమె కుటుంబ సభ్యుల పేర్లను పెడితే చివరకు వైయస్సార్ పేరునే ఎఫ్ఐఆర్‌లో చేర్చారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
పాదయాత్రకు జగన్ సిద్ధమైనా.. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై బెయిల్ రాకుండా అడ్డుకున్నాయని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు. కాంగ్రెసు, టిడిపిలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా అమ్మ విజయమ్మ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసినా ఎత్తడం లేదని ఇంతకంటే దారుణం మరొకటి లేదని షర్మిల అన్నారు.












Click it and Unblock the Notifications