విజయమ్మ మత ప్రచార సిడిని విడుదల చేసిన టిడిపి

పవిత్రమైన ఏసుక్రీస్తు నామం స్మరిస్తూ వేలకోట్లు దోచుకున్నారని నిప్పులు చెరిగారు. విజయమ్మ బైబిల్ పైన ప్రమాణం చేసి తాము రాష్ట్రాన్ని దోచుకోలేదని చెప్పగలరా అని సవాల్ చేశారు. ఏసుక్రీస్తును పూజిస్తామని చెబుతూనే వేలకోట్లు అక్రమంగా దోచుకున్నారని విమర్శించారు. జగన్ అక్రమంగా దోచుకున్న వేలకోట్ల సొత్తును పేద ప్రజలకు, పేద క్రైస్తవులకు పంచి పెట్టాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
కాగా బైబిల్ పైన వివాదం చెలరేగుతుండటంతో విజయమ్మ ఈ రోజు కడప జిల్లా పులివెందులలో స్పందించిన విషయం తెలిసిందే. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్‌ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పారు.
తన మతం మానవత్వమని ఆమె చెప్పారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతానికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులను ప్రేమించడమే తనకు నేర్పించారని చెప్పారు. తన భర్త చనిపోయి, తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితేనే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications