చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసమంటూ ఫిర్యాదు: తమిళ సినీ నిర్మాత అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamilnadu Map
చెన్నై: ఓ శ్రీలంక శరణార్థిని మోసం చేసిన కేసులో పోలీసులు ఆదివారం ఓ తమిళ సినీ నిర్మాతను అరెస్టు చేశారు. ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లడానికి వీసా ఇప్పిస్తానని శ్రీలంక శరణార్థిని ఆ నిర్మాత మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రామంతపురంలో గల శ్రీలం శరణార్థుల శిబిరంలోని వసంత కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు 31 ఏళ్ల చూడామణిని అరెస్టు చేశారు.ట

ఆస్ట్రేలియాలకు పంపిస్తానని చెప్పి చూడామణి తన వద్ద డబ్బులు తీసుకున్నట్లు కుమార్ పోలీసులకు ఫిర్యాదతు చేశాడు. పత్రాలను ఫోర్జ్ చేసి చూడామణి చాలా మందిని ఆస్ట్రేలియాకు పంపించినట్లు సమాచారం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

క్యూ బ్రాంచ్ పోలీసులతో పాటు చెన్నై పోలీసులు చూడామణి ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చూడామణి నుంచి ఎనిమిది నకిలీ పాస్‌పోర్టులు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చూడామణికి పెద్ద ముఠాతో సంబంధాలు ఉండవచ్చుననే అనుమానంతో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. విదేశాలకు పంపిస్తానని వెంకటేశ నగర్‌లోని సాలిగ్రామన్‌కు చెందిన చూడామణి ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

తాను సినీ నిర్మాతనని, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో అప్పులు చేశానని చూడామణి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అతను వారిని మోసం చేయడం ప్రారంభించాడు. చూడామణిపై ఇతర కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

English summary
A Tamil film producer was arrested in Virugambakkam on Sunday for allegedly duping a Sri Lankan refugee by promising him to get visa for migrating to Australia for a job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X