అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘువీరాపై షర్మిల ఫైర్, జగనన్న రాకుండా కుట్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తన పాదయాత్రలో అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై సొమ్ము ఒకరిది - సోకు ఒక్కరిది అన్నట్లు రఘువీరా రెడ్డి తీరు ఉందని ఆమె వ్యాఖ్యానించారు షర్మిల పాదయాత్ర గురువారం అనంతపురం జిల్లాలో కొనసాగింది.

మిగిలిన ఐదు శాతం పనులకు పాదయాత్ర అంటూ రఘువీరారెడ్డి బిల్డప్ ఇస్తున్నారని, హంద్రీనివా ప్రాజెక్టు మొదటి దస ఫనులను వైయస్ రాజశేఖర రెడ్డి 95 శాతం పూర్తి చేశారని చెప్పారు. గత మూడేళ్లలో ప్రాజెక్టుకు అవసరమైన 45 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిఎబీర్ ప్రాజెక్టుకు 10 టిఎంసిల నీటిని వైయస్ రాజశేఖర రెడ్డి కేటాయిస్తే దాన్ని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ఆమె అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తమ కుర్చీలను కాపాడుకునే పనిలో పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే 108 వాహనాలు ఇప్పుడు నడవడం లేదని షర్మిల అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం తెలుగుదేశం నిద్ర పోతోందని ఆమె వ్యాఖ్యానించారు. తన సోదరుడు వైయస్ జగన్ బయటకు రాకుండా తెలుగుదేశం, కాంగ్రెసు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆమె ఆరోపించారు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను విమర్శిస్తూ షర్మిల పాదయాత్ర సాగుతోంది. ముందు చంద్రబాబు, వెనక షర్మిల అన్నట్లుగా పాదయాత్రలు సాగుతున్నాయి.

English summary
YSR Congress president YS Jagan's sister Sharmila has expressed anguish at Raghuveera Reddy, minister from Anantapur district. Sharmila padayatra continued in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X