రోడ్డు ప్రమాదంలో కమెడియన్ జస్పాల్ భట్టి మృతి

జిల్లాలోని నకోదర్ ప్రాంతంలో గల షాకోట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని జస్పాల్ భట్టి సహాయకుడు వినోద్ శర్మ చెప్పారు. శుక్రవారం విడుదల కావాల్సిన తన పంజాబీ సినిమా పవర్ కట్ ప్రమోషన్ కోసం భటిండా నుంచి జలంధర్ వెళ్తుండగా ఆయన మృత్యువాత పడ్డారు.
కారు నడుపుతున్న భట్టీ కుమారుడు జస్‌రాజ్, సినిమా హీరోయిన్ సురీల్ గౌతం ప్రమాదంలో గాయపడ్డారు. వారిని జలంధర్‌లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం భట్టీ ఈ మధ్య విపరీతంగా ప్రయాణాలు చేస్తున్నారని శర్మ చెప్పారు.
చట్టపరమైన విషయాలను పూర్తి చేసిన తర్వాత భట్టీ మృతదేహాన్ని చండీఘర్ తరలించారు. అంత్యక్రియలు గురువారం సాయంత్రం జరిగే అవకాశాలున్నాయి. భట్టికి భర్యా సవిత, ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications