వాడిగా వేడిగా: కిరణ్‌ను నిలదీసిన పొన్నం, విహెచ్ ఫైర్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పినట్లుగా ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. సోనియా చెప్పినట్లు వినరా అని ఘాటుగా ప్రశ్నించారు. డబ్బులు లేకపోతే ఎక్కడి నుండైనా సర్దుబాటు చేయాలని, అంతేకాని కేంద్రం ఇస్తున్న ఆరింటికి మరో మూడు కలిపి ఇవ్వకుండా మాత్రం ఉండవద్దన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.
విభేదాలు లేవు.. జగ్గారెడ్డి
ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రభుత్వం చీప్ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. దామోదర కిరణ్‌ను ఎప్పుడూ బహిరంగంగా విమర్శించింది లేదన్నారు. ఆందోల్‌కు సిఎం కిరణ్ వెళ్లాల్సిన అవసరం లేదని, డిప్యూటీ సిఎం ఆందోల్‌ను అభివృద్ధి చేసుకుంటారని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. తాము దామోదర, మరో ఇద్దరి మంత్రుల నేతృత్వంలో పని చేస్తామన్నారు. తెలంగాణపై తేల్చితేనే సభ్యత్వ నమోదు సాఫీగా సాగుతోందని నర్సా రెడ్డి అన్నారు.
విజయమ్మకు రక్షణ మాకు అరెస్టులా.. పొన్నం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తెలంగాణకు వచ్చినప్పుడు ఆమెకు రక్షణ కల్పించి మమ్మల్ని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణపై ఇదే భేటీలో పార్టీ వైఖరి స్పష్టం చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టారు.
ఉదయం పదకొండు గంటలకు గాంధీ భవనంలో మేధోమథనం జరిగింది. ఈ భేటీకు పలువురు నేతలు హాజరయ్యారు. భేటీ వాడిగా వేడిగా జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురు ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారని సమాచారం. ఇంకొందరు నిలదీశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications