ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై విచారణ

భూకేటాయింపు వ్యవహారంలో మాజీ మంత్రులు ఆర్‌వి దేశ్‌పాండే, డికె శివకుమార్, నైస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ ఖేనీలపై కూడా లోకాయుక్త కోర్టు విచారణకు ఆదేశించింది. బెంగళూర్ మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ రింగ్ రోడ్డును వాడుతున్న వాహనాల నుంచి వసూలు చేసిన టోల్‌ను జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సామాజిక కార్యకర్త టిజె అబ్రహం తన ఫిర్యాదులో 102 మందిని పేర్కొనగా, కోర్టు ఆదేశాల్లో 30 మంది చోటు చేసుకున్నారు. విచారణ బృందానికి లోకాయుక్త పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ హెచ్ఎన్ఎస్ రావు నేతృత్వం వహిస్తారు. నలుగురు డిప్యూటీ సూపరింటిండెంట్లు సహకరిస్తారు. నైస్‌కు చెందిన రెండు భవనాలను కూడా జప్తు చేస్తారు.
కోర్టు ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత న్యాయం కోసం పైకోర్టుకు వెళ్తామని నైస్ ప్రతినిధి చెప్పారు. ఫిర్యాదు ప్రకారం - ఎక్స్‌ప్రెస్ వే కోసం రైతుల నుంచి భూములు సేకరించారు. దానికితోడు 1,913 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. ముప్పయి ఏళ్ల లీజుకు కేవలం ఏడాడికి పది ఎకరాలకు మాత్రమే నైస్ లీజు చెల్లించే విధంగా ఉంది.
విచారణను ఎదుర్కునే దేవెగౌడ భారత ప్రధానిగా కూడా పనిచేశారు. ఎస్ఎం కృష్ణ శుక్రవారం నాడే విదేశీ వ్యవహారాల మంత్రిగా రాజీనామా చేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బిజెపికి రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications