అమెరికాలో సాన్వీ హత్య: నిక్‌నేమ్ టెక్కీని పట్టిచ్చింది

సాన్వీని హత్య చేసి శవాన్ని సూట్‌కేసులో పెట్టాడు. వెన్నా సాన్వీని హత్య చేసిన రఘునందన్ యార్లగడ్డను దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. నాయనమ్మ సత్యవతిని హత్య చేసి సాన్వీని రఘు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా అప్పర్ మెరియాన్ టౌన్‌షిప్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ నుంచి సాన్వీ అపహరణకు గురైంది.
రఘునందన్ యార్లగడ్డ కూడా అదే కాంప్లెక్స్‌లో ఉంటాడు. కింగ్ ఆఫ్ ప్రష్యాలోని ఆపార్టుమెంట్ జిమ్నాజియం లాకర్ రూంలో దాచిన సాన్వీ హృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు అధికారులు రఘును అరెస్టు చేసి పెన్సిల్వేనియా కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో డబ్బు కోసం తాను సాన్వీ తల్లిదండ్రులు వెంకట వెన్నాను, చెంచు లత పునూరును లక్ష్యం చేసుకున్నట్లు రఘు విచారణలో చెప్పాడు.
డబ్బులు డిమాండ్ చేస్తూ రాసిన లేఖ పది కాపీలను అపార్టుమెంటులో వదిలాడు. వెంకట భార్యను లత అనే పేరుతో కొద్ది మంది సన్నిహిత మిత్రులు మాత్రమే పిలుస్తారు. లేఖలో మొదటి పదం శివ అని ఉంది. తన పూర్తి పేరు వెంకటన కొండ శివప్రసాద్ వెన్నా అని, కొద్ది మంది సన్నిహిత మిత్రులు శివ అని పిలుస్తారని చెప్పాడు.
దాంతో ఎవరెవరు శివ, లత అనే పొట్టి పేర్లతో పిలుస్తారనే జాబితాను అధికారులు సాన్వీ తల్లిదండ్రుల నుంచి తీసుకున్నారు. వారిచ్చిన పేర్లలో రఘు అనే పేరు ఉంది. అది రఘునందన్ యండమూరిదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. సాన్వీ కిడ్నాప్‌ను అడ్డుకోవడం వల్లనే సత్యవతిని చంపినట్లు రఘు చెప్పాడు. పాప ఏడుస్తుండడంతో నోట్లో కర్చీఫ్ కుక్కినట్లు తెలిపాడు. ఆమె తలపై తువ్వాల చుట్టినట్లు చెప్పాడు.
-
ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రం నుంచి భారీ లీక్- ఐరాసకు లేఖ -
యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు!












Click it and Unblock the Notifications