పార్టీలో నిర్లక్ష్యం, కావూరికి అన్యాయం: హర్షకుమార్

 Harsha Kumar
ఏలూరు/గుంటూరు: కాంగ్రెసు పార్టీలో తమ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ ఆదివారం అన్నారు. మాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావును కూడా పార్టీ అధిష్టానం నిర్లక్ష్యం చేసిందన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం బాధాకరమన్నారు.

కేంద్రమంత్రి మండలి విస్తరణపై గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు కూడా తన అసంతృప్తిని గుంటూరు జిల్లాలో వ్యక్తం చేశారు. మంత్రి వర్గ విస్తరణలో సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. తన తమ్ముడు, నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని రాయపాటి చెప్పారు.

కాగా శనివారమే కావూరి సాంబశివ రావు అలకబూనిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోకసభ స్థానం నుంచి రెండు సార్లు, మచిలీపట్నం నుంచి మూడు కావూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. కావూరి నిన్న తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. పార్టీలో ప్రాధాన్యత ఉన్న పదవిని అప్పగిస్తామని తెలిపింది. ఆయన రాజీనామా చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+