నా కొడుకు శిక్షార్హుడే, భారత్‌లోనే: శాన్వి హంతకుడి తల్లి

అయితే హత్యకు దారి తీసిన కారణాలను కూడా వెలికి తీయాలని ఆమె కోరింది. రఘునందన్‌ది మొదటి నుండి నేరపూరిత స్వభావం కాదని, నలుగురికి సహాయం చేసే గుణం అని చెప్పారు. ఎవరికీ ప్రాణహానీ చేసే వాడు కాదన్నారు. అయితే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాల్సిందేనని, ఆ శిక్షను మన భారత దేశంలోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాన్విని తన తనయుడు హత్య చేసినందుకు ఆ కుటుంబానికి ఆమె క్షమాపణలు చెప్పారు.
రఘు తనతో వారం రోజులుగా మాట్లాడటం లేదని, ఒక్కసారి అతనితో మాట్లాడించాలని ఆమె రోదించారు. తన తనయుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు. కాగా చిన్నారి శాన్విని కిడ్నాప్ చేసి, చంపేసిన రఘును ఎఫ్‌బిఐ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. శాన్వి తండ్రిని అందరూ వెంకట్ అని పిలుస్తారు. కొందరు మాత్రమే శివ అంటారు. ఈ ఆధారంగానే పోలీసులు నిందితుడు రఘునందన్‌ను గుర్తించారు.












Click it and Unblock the Notifications