అంతిమ యాత్రలో బాబు: పాదయాత్రకు మరో రోజు బ్రేక్

దీంతో చంద్రబాబు ఉదయం మహబూబ్ నగర్‌లో మాట్లాడుతూ.. తాను వస్తున్నా మీకోసం పాదయాత్రను పవిత్ర కార్యంతో ప్రారంభించానని, అయితే తన సహచరుడు, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయినందు వల్ల పాదయాత్రను ఈ రోజు రద్దు చేసుకుంటున్నానని, సాయంత్రం తిరిగి వచ్చి మళ్లీ కొనసాగిస్తానని చెప్పారు. అయితే ఎర్రన్నాయుడు అంత్యక్రియలు శనివారం కానున్నాయి.
చంద్రబాబు అంతిమయాత్రలో పాల్గొననున్నారు. రేపు(శనివారం) ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారక లాంఛనాలతో ఎర్రన్నాయుడికి అంత్యక్రియలు జరిపించాలని ముఖఅయమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. చంద్రబాబుతో పాటు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్‌లు కూడా అంత్యక్రియల్లో పాల్గొంటారని సమాచారం.
దీంతో బాబు యాత్ర శనివారం కూడా వాయిదా పడనుంది. యాత్ర పూర్తయ్యే వరకు మధ్యాహ్నం అవుతుంది. దీంతో వచ్చి పాదయాత్ర చేపట్టే అవకాశాలు తక్కువే. ఆదివారం నుండి తిరిగి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications