ప్రజల కోసమే: జగన్ జైలుపై కిరణ్‌కు షర్మిల కౌంటర్

పాలనపై ముఖ్యమంత్రికి ఏమాత్రం అవగాహన లేదని, దీంతో యంత్రాంగం కూడా సరిగా పని చేయడం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కొనసాగిస్తుందని చెప్పారు. జగన్ ఎందుకోసం జైలుకెళ్లాడని మెదక్ జిల్లా ఇందిర బాటలో ముఖ్యమంత్రి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. జగన్ ప్రజల కోసమే జైలుకు వెళ్లారన్నారు. పేదల గుండెల్లో జగన్ స్థానం సంపాదించుకున్నందునే టిడిపితో కలిసి కాంగ్రెసు కుట్ర చేసిందన్నారు. ఆయన బయట ఉంటే కాంగ్రెసుకు, టిడిపికి ఉనికి ఉండదనే భయం వారిలో ఉందన్నారు.
జగన్ కాంగ్రెసులోనే ఉంటే కష్టాలు ఉండేవి కావని గులాం నబీ ఆజాద్ చెప్పారన్నారు. కావాలనే జైల్లో పెట్టారని ఆయన వ్యాఖ్యలతోనే అర్థమవుతోందన్నారు. కాగా షర్మిల ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, సాయంత్రం నాలుగున్నర గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఆమె పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications