కావూరి అసంతృప్తి: నేరుగా రంగంలోకి దిగిన సోనియా

ఈ రోజు(ఆదివారం) తనను కలవాల్సిందిగా సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్న కావూరికి సూచించినట్లుగా సమాచారం. ఇవాళ ఏ సమయంలోనైనా ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రామ్ లీలా మైదానంలో కాంగ్రెసు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. బిజీలో ఉన్న సోనియాను కావూరి కార్యక్రమం అనంతరం కలిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కక పోవడంతో కావూరి తీవ్ర అసంతృప్తికి లోనై అధినేత్రికి రాజీనామా లేఖలు పంపిన విషయం తెలిసిందే. లోకసభ సభ్యత్వానికి, మిగతా స్థాయి సంఘం పదవులకు, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సమన్వయ కమిటీకి ఇలా అన్ని పదవులకు రాజీనామా చేశారట. ఒక్క కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మినహా అన్ని పదవులకు రాజీనామా సమర్పించిన ఆయన వాటిని నేరుగా ఆయా కార్యాలయాలకు కాకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
అలక వహించిన కావూరితో ఈ నెల 6న కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, దిగ్విజయ్ సింగ్ కూడా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత కావూరి పార్టీలో కొనసాగుతారా లేరా అనే అంశం కూడా తేలిపోతుందనే వార్తలు వచ్చాయి. అయితే దిగ్విజయ్ కంటే ముందే సోనియా ఆయనకు పరిస్థితి వివరించి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications