నిద్రలోనే మృత్యు ఒడిలోకి నలుగురు చిన్నారులు

West Godavari District
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం గోవిందరావుగూడెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. నిద్రలోనే వారు మృత్యు ఒడిలోకి చేరిపోయారు. ఒకే మంచంపై నిద్రిస్తున్న నలుగురు పిల్లలపై విద్యుత్ వైరు తెగి పడి మంటలు అంటున్నాయి. ఈ మంటల్లో చిన్నారులు దహనమయ్యారు. ఈ సంఘటన సోమవారం పగలు జరిగింది.

మంటలకు ఇల్లు కూడా కాలిపోయింది. మంటలను చూసిన చుట్టుపక్కల వాళ్లు ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే, షాక్ తగలడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృత్యువాత పడిన పిల్లలను శరీష (3), పండు (4), గౌరీశంకర్ (5), సాగర్ బాబు (3)లుగా గుర్తించారు.

టీవీ చూసి చిన్నారులంతా ఒకే మంచంపై పడుకున్నారు. ఆ సమయంలో పెద్దలెవరూ ఇంట్లో లేరు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో పనులకు వెళ్లారు. పక్కింట్లోంచి వైరు లాగి ఓ బల్బు అమర్చుకున్నారు. ఆ బల్లు వద్ద షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

మృత్యువాత పడిన పిల్లలు అక్కాచెల్లెళ్ల బిడ్డలు. ఇంట్లోని పిల్లలంతా మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. ప్రమాదం సంభవించినప్పుడు బయటకు పిల్లల అరుపులు కూడా వినిపించలేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+