భవనంపై నుంచి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య

Software Engineer jumps to death from office building
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబారంలో తన కార్యాలయ భవనంపై నుంచి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది. కార్యాలయంలో పని ముగించి, ఇంటికి వెళ్లే సమయంలో ఆర్ నళిని అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

మద్రాసు ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌లోని కార్యాలయం భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. తన భర్త రామ్ కుమార్‌తో కలిసి నళిని తాంబారం సమీపంలోని పుజితివాక్కంలో నివాసం ఉంటోంది. రామ్ కుమార్ టి. నగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.

నళిని భవనంపై నుంచి దూకిన విషయాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. ఆ భవనంలో పలు సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు. తాంబారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

నళిని ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, విచారణ నిమిత్తం ఆమె భర్తను పిలిచామని పోలీసులు చెప్పారు. ఇటీవల హైదరాబాదులో నీలిమ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కార్యాలయ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర వివాదం సృష్టించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+