హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవే ఇబ్బంది పెడుతోంది: తెలంగాణపై జానారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ తీసుకు రావడం తమ వల్ల కాదనిపిస్తే ఇతరుల వద్దకు వెళ్లవచ్చునని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి బుధవారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ మంత్రుల లక్ష్యమన్నారు. తాము తమ పార్టీ అధిష్టానం వద్ద తెలంగాణ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ కోసం మా ప్రయత్నాలు మేం చేస్తున్నామన్నారు.

అయితే ఇప్పుడున్న మంత్రి పదవే తనను ఎక్కువగా ఇబ్బంది పెడుతోందన్నారు. తెలంగాణ సమస్యను పార్టీ అధిష్టానం, కేంద్రం వెంటనే తేల్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు చేసిన వారిపై నిఘా పెట్టాలన్నారు. మంత్రులపై నిఘా పెట్టడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదన్నారు. తెలంగాణ ఇస్తే అంతకుమించి ఏమీ వద్దన్నారు.

విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలోగా కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతికుండి సాధించుకోవాలని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. తెలంగాణ తప్పకుండా వస్తుందన్నారు. త్వరలో కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ బాగా పని చేస్తున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధ రేణుకా చౌదరి అన్నారు. వారిని మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. తుఫాను పంట నష్టంపై ఇంకా పూర్తిగా అంచనా వేయలేదన్నారు. అంచనా వేసిన తర్వాత ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం అడుగుతారని చెప్పారు.

English summary
Minister Jana Reddy said that T-ministers are trying to convince High Command on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X