టైం, ప్లేస్ చెప్పు: తెలంగాణపై హరీష్‌కు కడియం సవాల్

తెలంగాణ అభివృద్ధిపై హరీష్ రావు సమయం, వేదిక, అజెండా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున తాను రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అభివృద్ధిపై చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమని తన ప్రతి సవాల్ స్వీకరించాలన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీ పైన మాట్లాడని తెరాస నేతలు చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
సోనియాపై వారు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విమర్శించడం లేదన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన తెలంగాణ ప్రజల్ని మోసం చేసే విధంగా ఉందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి తరఫున ఒక్కరినే పంపిస్తామన్నారు.
కేంద్రంపై అందరు కలిసి తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకు రావాల్సి ఉందన్నారు. కేంద్రం తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని, తమ చేతకానితనాన్ని ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ అంశాన్ని నాన్చకుండా తక్షణమే పరిష్కారించాలన్నారు. ఆస్తులు కూడబెట్టుకున్న తెరాస నేతలు తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
ప్రధానికి పంపించాం
తాము తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ పంపించామని, టిడిపి లేఖ తనకు అందలేదని షిండే చెప్పడం హాస్యాస్పదం, విడ్డూరమని మాజీ మంత్రి, టిడిపి నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు.












Click it and Unblock the Notifications