కన్నీరు పెట్టిన షర్మిల: మన్మోహన్‌కు విజయమ్మ లేఖ

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మళ్లీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజ్యం వస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని విమర్శించారు. చంద్రబాబు మాటలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదన్నారు. చంద్రబాబు తాను పాలించినప్పుడు చేసింది చెప్పలేక పోతున్నారన్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన నీలం తుఫాను బాధితులను ఆదుకోవాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని, ఇతరత్రా 12 డిమాండ్లను ఆ లేఖలో పేర్కొన్నారు. తుఫాను నష్టాన్ని వివరించటం కోసం కలవడానికి అనుమతినివ్వాలని ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications