జగన్ బెయిల్ పిటిషన్: టైమ్ కోరిన సిబిఐ, వాయిదా

కాగా వైయస్ జగన్ గత శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిర్ణీత గడువులోగా సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేయలేదని జగన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాఫ్తు పేరిట సిబిఐ కాలయాపన చేస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాలయాపన చేస్తోందంటూ తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ అందులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినప్పటికీ సిబిఐ ఛార్జీషీట్ ఇంకా దాఖలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు.
సిఆర్‌పిసి సెక్షన్ 167(2) కింద తాను బెయిల్ పొందేందుకు అర్హుడనని జగన్ అందులో పేర్కొన్నారు. గతంలో జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు సిబిఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరులోగా కేసు విచారణ ముగించాలని ఆదేశిస్తూ.... అప్పటి వరకు బెయిల్ కోరవద్దని జగన్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, సిబిఐ కౌంటర్ దాఖలు చేసినప్పుడు మొదటి ఛార్జీషీట్‌కు సంబంధించి 90 రోజులు పూర్తవలేదు.
దీంతో విచారణ జరిగినప్పుడు సుప్రీం కోర్టు బెయిల్ పిటిషన్ తేది, సిబిఐ కౌంటర్ తేదిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటుందని సమాచారం. సుప్రీం కోర్టు దానిని పరిగణలోకి తీసుకొని జగన్‌ను బెయిల్ కోరవద్దని తెలిపింది. అయితే ఆ తర్వాత తొంబై రోజులు దాటడంతో జగన్ తాజాగా స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి సిబిఐ రెండు రోజుల్లో కౌంటర్ వేయనుంది.












Click it and Unblock the Notifications