• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ తెలంగాణ యముడు, సైంధవుడు: కెటిఆర్

By Pratap
|
KT Rama Rao
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తెలంగాణ పాలిటి యముడిగా, సైంధవుడిగా అభివర్ణించారు. తెలుగదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. కాంగ్రెసును రాజకీయంగా పాతరేయాలని పిలుపునివ్వడానికి సూర్యాపేట బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై యుపిఎ దున్నపోతుపై వాన పడినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు

సీమాంధ్ర నాయకుల పెత్తనంలో ఉన్న పార్టీల్లోని నాయకులంతా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పెత్తనాన్ని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. స్వీయాత్మకంగా ఎదిగి వచ్చిన ఏకైక తెలంగాణ పార్టీ తెరాస అని, తెరాసను బలపరిస్తేనే తెలంగాణ సాధన సులభమవుతుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు పాదయాత్రల పేర డ్రామాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అధికారం కోసం గోతి కాడి నక్కలా 2004 ఎన్నికలకు ముందు కూర్చున్నారని, తెరాసతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నారని, ఆ తర్వాత ధన బలంతో తెరాసను బలహీనపరచడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణను గౌరవిస్తామని చెప్పి, ఓట్లు పడగానే అవతలికి వెళ్లి రాష్టం ఏర్పడితే తెలంగాణకు వెళ్లాలంటే పాస్‌పోర్టు కావాల్సి వస్తుందని వైయస్ అన్నారని ఆయన గుర్తు చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు రాయలసీమ దాదాగిరి ప్రదర్శిస్తున్నారని, ఇదే దాదాగిరి చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని, అప్పుడు వారు తిరిగే పరిస్థితి కూడా ఉండదని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వారి సోదేదో వారు చెప్పుకుని వెళ్లిపోవాలని ఆయన అన్నారు. వైయస్ దేవునడు, స్వర్గం నుంచి దిగొచ్చాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పుక్కిటి పురాణాలు వల్లిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి నిండు సభలో తమ శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ను అవమానించారని ఆయన గుర్తు చేశారు

రాజకీయ పార్టీలుగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వారి వారి కార్యకలాపాలు చేసుకుని వెళ్లిపోవాలని ఆయన సూచించారు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ్యులను అడ్డుగోలుగా కొనడమేనా విశ్వసనీయత అని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను ప్రశ్నించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,84,467
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  0.00%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  100.00%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  3.89%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.24%
  ఎస్టీ

English summary
Telangana Rastra Samithi (TRS) MLA KT Rama Rao has termed YS Rajasekhar Reddy as Telangana Yama and Saindhava. He lashed out at YSR Congress and Telugudesam parties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more