వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2002 ముంబై పేలుళ్లు: హైదరాబాద్‌లో టెక్కీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie held in Hyderabad for 2002 BEST bus blast at Ghatkopar
ముంబై: ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందనే ఆరోపణపై నగర నేర పరిశోధక విభాగం పోలీసులు హైదరాబాదులో ఓ టెక్కీని అరెస్టు చేశారు. ముంబైలోని ఘట్కోపార్ స్టేషన్ వద్ద బెస్ట్ బస్‌లో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు. తాజూల్ కాజీ (30) అనే టెక్కీ నిజానికి ఔరంగాబాద్‌కు చెందినవాడు. వేరే ఐడి వాడుతూ హైదరాబాదులో ఉంటూ అతను హిందూస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు.

ఓ వారం రోజుల పాటు అతనిపై నిఘా పెట్టి సీనియర్ ఇన్‌స్పెక్టర్స్ శశాంక్ సాన్‌భోర్, అజయ్ సావంత్ కేంద్ర నిఘా విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కాజీ తన పేరును సిద్దిఖి తాజు ఇస్లాం అమీనుద్దీన్‌‌గా మార్చుకున్నాడని, ముంబై పేలుళ్లు జరిగిన వెంటనే పోలీసులు గాలిస్తున్న సమయంలో అతను హైదరాబాదుకు పారిపోయాడని పోలీసులు చెప్పారు.

కాజీ నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సభ్యుడు. 2002 డిసెంబర్ 6వ తేదీన ఘటక్‌పోర్ రైల్వే స్టేషన్ సమీపంలో బెస్ట్ బస్సులో బాంబు పెట్టారు. అది పేలడంతో బస్సు దగ్ధమై నలుగురు మృతి చెందగా, 30 మంది దాకా గాయపడ్డారు. ఎనిమిది నెలల కాలంలో జరిగిన ఐదు బాంబు పేలుళ్లలో ఇది మొదటిది.

ఈ ఘటనలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఖవాజా యూనస్, డాక్టర్ అబ్దుల్ మతీన్, జమీల్ అహ్మద్, ఇమ్రాన్ రెహ్మాన్ ఖాన్, అల్తాఫ్ మొహ్మద్ ఇస్మాయిల్, తోఫీక్ అహ్మద్, అరిఫ్ పాన్వాలా, హరున్ రషీద్ లోహర్, రషీద్ అన్సారీలను పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాలు లేకపోవడంతో వారికి 2005లో కోర్టు విముక్తి ప్రసాదించింది.

English summary
The city crime branch has arrested a software engineer from Hyderabad for his alleged role in the 2002 blast on a BEST bus at Ghatkopar, which killed four people. Aurangabad native Tajool Kazi (30), who was picked up from his home on Thursday night, was employed with Hindustan Computers Limited and lived in Hyderabad using a different ID.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X