వెనక్కి తెలంగాణ ఇష్యూ: రాహుల్ గాంధీ పనే?

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనతో పార్టీ అధిష్టానం పెద్దలు ఎకె ఆంటోనీ తదితరులు కెసిఆర్‌తో చర్చలు జరిపారని, పార్టీపరంగా చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత రెండో దశ చర్చలను ఆపేసినట్లు చెబుతున్నారు. తొలి విడత చర్చల తర్వాత రాహుల్ గాంధీని కొంత మంది నాయకులు కలిసినట్లు చెబుతున్నారు. సీమాంధ్ర నాయకులే కాకుండా తెలంగాణకు చెందిన నాయకులు కూడా తెరాస విలీనం పట్ల తీవ్ర విముఖత ప్రదర్శించినట్లు సమాచారం.
తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి వంటివారితో పాటు రేణుకా చౌదరి వంటి నాయకులు కూడా తెరాస విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. దీంతో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా స్పందించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా ప్రత్యామ్నాయమే మేలనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీ నియంత్రణలోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ కోసం చట్టబద్దమైన ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మార్పుపై కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తూ తెలంగాణ బోర్డుకు మర్రి శశిధర్ రెడ్డి వంటి నాయకుడిని చైర్మన్‌గా నియమించాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల లోకసభ నియోజకవర్గాలతో పాటు మరి కొన్ని లోకసభ స్థానాలను గెలుచుకునే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల లోకసభ స్థానాలు గెలుచుకోవడానికి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. ఏమైనా, అంతా రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications