జగన్ బెయిల్‌పై షర్మిల ప్రశ్న, చంద్రబాబుపై ఫైర్

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను స్మశానాలుగా మార్చారని ధ్వజమెత్తారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను అమలు చేస్తానంటూ అబద్దాలాడుతున్నారన్నారు. ఓ వైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అవిశ్వాసం పెట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఒక వ్యక్తి రిమాండ్ కాలం 90 రోజులు దాటితే బెయిల్ ఇవ్వాలని మన చట్టాలు చెబుతున్నాయని, కానీ 90 రోజులు దాటినా జగన్‌కు ఇంకా బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు.
సిబిఐని ఉపయోగించుకొని ఇది కాంగ్రెసు వాళ్లు చేస్తున్న కుట్ర అన్నారు. బాబు సిఎం అయి ఉంటే ఆర్టీసి ఇప్పటికి ప్రయివేటు పరం అయుండేదన్నారు. వైయస్ బతికున్నప్పుడు పాలమూరు జిల్లాను త్యాగమూర్తుల జిల్లాగా చెప్పేవారని, ఈ జిల్లా సమస్యలను చూసి నాన్న నిత్యం బాధపడే వారన్నారు. చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications