హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుజ్జగింపులకు నో: పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తాను అనుకున్నదే చేశాడు. ఎందరు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. గురువారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసిన పెద్దిరెడ్డి ఆయనకు తన రాజీనామాను సమర్పించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా తాను తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన స్పీకర్‌కు రాజీనామా ఇచ్చిన అనంతరం చెప్పారు.

అయితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడం లేదని, అదే పార్టీలో కొనసాగుతానని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ నెలాఖరులోగా మార్చకుంటే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు పార్టీ అధిష్టానంకు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అంతకుముందు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కిరణ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ నెలాఖరులోగా కిరణ్‌ను తొలగించేకుంటే తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. దీంతో అతనిని బుజ్జగించేందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తదితరులు రంగంలోకి దిగారు. బుధవారం సాయంత్రం ఆయనకు ఫోన్ చేసి రాజీనామా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పెద్దిరెడ్డి నిర్ద్వంధంగా తోసిపుచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేస్తానని చెప్పారు.

ఉదయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఆయితే పెద్దిరెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. పెద్దిరెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పీలేరు నుండి మూడుస్రాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. డీలిమిటేషన్ నేపథ్యంలో 2009లో పుంగనూరు నుండి ఎన్నికయ్యారు.

English summary
Former Minister and Punganur MLA Peddireddy Ramachandra Reddy has resigned for his legislator on Thursday. He was submitted his resignation letter to Speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X