వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యభిచామన్నట్టే: జంప్‌లపై మురళీమోహన్ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Murali Mohan
నిజామాబాద్/రాజమండ్రి: రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో నీరు బంద్ మందు ఫుల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావాలనే కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు.

ఎఫ్‌డిఐలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం ముందుకు వెళుతోందని, అదే తెలంగాణ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటును తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమం పేరుతో స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ఆరు నెలలు ఫాం హౌస్‌లో పడుకుంటారని ఆ తర్వాత వచ్చి మాయమాటలు చెబుతారన్నారు.

బాబ్లీ, గల్ఫ్, బీడి కార్మికుల సమస్యలను తెరాస ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గల్ఫ్ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గిరిజనులకు అండగా ఉంటామన్నారు. కాగా అంతకుముందు బాబు పాదయాత్ర పిట్లం నుంచి ప్రారంభమైంది. అనంతరం స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.

వ్యభిచారంతో సమానం

పార్టీలు మారే వారిపై సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ రాజమండ్రిలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారటం అంటే ఒకరితో పెళ్లై మరొకరితో సంసారం చేసినట్లన్నారు. పెళ్లైన తర్వాత మరొకరి వైపు ఆకర్షించబడటం ఎంత తప్పో పార్టీలు మారటం కూడా అంతే తప్పు అన్నారు. పార్టీలు మారటం అంటే వ్యభిచారం కిందకే లెక్క అన్నారు. అయినా పార్టీలు మారుతున్న వారిలో ఎక్కువ మంది ముసలివాళ్లు, అవకాశం రాదనుకున్న వాళ్లే ఉన్నారన్నారు.

ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చినా ఆశ తీరటం లేదని విమర్శించారు. పదవులు ఆశించే వారు ముసలి వారు అయినా ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉండాలా అని ప్రశ్నించారు. యువతకు అవకాశం రావద్దా అన్నారు. పార్టీలు మారే వారు సిగ్గుపడాల్సింది పోయి గర్వంగా ఫీలవుతున్నారన్నారు. రాజ్యసభ పదవి ఇవ్వలేదని, మరో పదవి ఇవ్వలేదని పార్టీలు వీడటం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. వచ్చేసారి రాజమండ్రి నుండే పోటీ చేస్తానని చెప్పారు.

పాలమూరులో షర్మిల

మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ధరల పెంపుదలపై ఆమె మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ధరలను పెంచలేదని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం అన్ని ధరలను పెంచుతోందని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే రామరాజ్యం సాధ్యమన్నారు.

English summary
Telugudesam Party senior leader Murali Mohan has 
 
 blamed Jumping MLAs on Thursday in Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X