హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలులో జగన్ కాలికి గాయం: నడవలేక ఇబ్బంది

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం వార్తలు వస్తున్నాయి. జగన్ కాలి బొటన వేలికి గాయమైందని అంటున్నారు. వారం రోజుల క్రితం గాయమైందని, అయితే గాయం చిన్నపాటిదని ముందు అనుకున్నారని, ఆ గాయంతో జగన్ వారం రోజుల పాటు సరిగా నడవలేకపోయారని సమాచారం.

గాయం మానకపోవడంతో జైలులో ఎక్స్‌రే తీయించారు. దీంతో ఆయన కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలిందని అంటున్నారు. భద్రతా కారణాల రీత్యా జైలులోని ఎక్స్‌రే తీయించినట్లు చెబుతున్నారు. ఓ ప్రైవేట్ టెక్నీషియన్‌ను పరికరాలతో సహా రప్పించి ఆ పని పూర్తి చేసినట్లు సమాచారం. దాంతో జగన్ కాలికి వైద్యులు చికిత్స చేశారు. నడక మానేసి విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఆదివారం తన గది నుంచి కదలలేని చెబుతున్నారు.

జగన్ దెబ్బ కాస్తా నయమైనట్లు, ఇప్పుడు జగన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని వారు అంటున్నారు. నిజానికి, ఉస్మానియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లి ఎక్స్‌రే తీయించాలని భావించినట్లు, అయితే భద్రతా కారణాల రీత్యా టెక్నీషయన్‌నే జైలుకు పిలిపించినట్లు తెలుస్తోంది.

అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ జగన్ ఈ ఏడాది మే చివరివారంలో అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. పలు మార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఆయనతో పాటు మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి పలువురు విఐపి ఖైదీలు చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

English summary
YSR Congress party president YS Jagan has been injured in Chanchalguda jail a week back. It is said that his leg finger was fractured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X