వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహ స్థాపన వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి, సినీ హీరోగా, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావును ప్రత్యర్థులు కూడా అత్యంత గౌరవ భావంతో చేసేవారు. ఆయన మాటకు విలువ ఉండేది. ఆయన విగ్రహం చూపరులను కట్టిపడేసిది.

ఇప్పుడు రాజకీయాల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహ స్థాపన క్రెడిట్‌ను ఒకరిని మించి, మరొకరు కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం బజారుకెక్కింది. మరోవైపు, ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వారసుడిగా తన తనయుడు లోకేష్‌ను తేవడానికి ప్రయత్నాలు చేస్తుంటే, ఆ ప్రయత్నాలను హరికృష్ణ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను అడ్డు పెట్టి నిరోధిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది.

ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

ఎన్టీ రామారావు చేయి పైకెత్తి ఇదేమిటి బ్రదర్ అంటే ఎదుటి వారు అలా నిరుత్తరులై నిలబడే స్థితి ఉండేది. ఆయన ధోరణి ధిక్కారమున్ సైతునా అన్నట్లుండేది. ఇప్పుడు తన విగ్రహం కోసం ఇంతగా రాజకీయం చేస్తారా అని ప్రశ్నిస్తున్నట్లు లేదూ...

ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

చంద్రబాబు నాయుడు తన తెలుగుదేశం పార్టీ పగ్గాలను తన తనయుడు నారా లోకేష్‌కు అప్పగించేందుకు లోలోపల కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. లోకేష్‌కు ఆయన రాజకీయ పాఠాలు కూడా చెబుతున్నారట.

 ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

మరోవైపు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ నారా లోకేష్‌ను ముందుకు తెచ్చే చంద్రబాబు వైఖరిని ఇష్టపడడం లేదని అంటున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆయన అంతర్గత వారసత్వ పోరు చేస్తున్నట్లు వినికిడి.

 ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

బాలకృష్ణ తన కూతురిని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా చంద్రబాబును సమర్థించాల్సిన పరిస్థితిలో పడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించడానికి ముందుకు వచ్చారు. దీంతో పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి, తన బావ చంద్రబాబుకు దక్కాలని ఆయన ఆశిస్తున్నారని అంటున్నారు. అందుకే, సోదరి పురంధేశ్వరిపై, మరో బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై విరుచుకుపడ్డారని చెబుతున్నారు.

 ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

వారసత్వ పోరులో భాగంగా హరికృష్ణ చంద్రబాబును, తన సోదరుడు బాలకృష్ణను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా, సోదరి పురంధేశ్వరిపై ఈగ వాలినా ఆయన సహించరని అంటారు. అందుకే ప్రస్తుత వివాదంలో ఆయన పురంధేశ్వరి పక్కన నిలబడినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదేమిటి బ్రదర్?: సోదరికి హరికృష్ణ, బావకు బాలయ్య

ఎన్టీ రామారావు ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. నిండు సభలో ఆయన తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఈ ప్రకటన చేసినా ఆయన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్ఠాపనలో తన పాత్ర కూడా ఉండాలని లక్ష్మీపార్వతి అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, కాంగ్రెసు నాయకురాలు పురంధేశ్వరికి మధ్య చెలరేగిన వివాదంతో కుటుంబ సభ్యులు మొత్తం బహిరంగంగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి తనకు కూడా వాటా కావాలని ముందుకు వచ్చారు. ఈ వివాదంలో ఎన్టీఆర్ పుత్రుల్లో బాలకృష్ణ చంద్రబాబు వైపు ఉండగా, హరికృష్ణ పురంధేశ్వరి వైపు ఉన్నట్లు కనిపిస్తోంది.

English summary
According to analysts - The installation of NTR statue in Parlaiment premises not only took political turn and also taking into the diriction of Nandamuri family divide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X