వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కాంగ్రెస్‌పై బరువేసిన బాబు, జగన్ పైనా ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్టీయే మొట్టమొదట తేల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. అదిలాబాద్ జిల్లాలో ఆయన ఆరో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణను మొదట కాంగ్రెసు పార్టీయే తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత తాము అక్కడికక్కడే అభిప్రాయం చెప్పేస్తామన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉంటూనే అక్కడి నుండే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు లేకుంటే అధికారంలోకి టిడిపియే వచ్చేదన్నారు. తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు.

తెలంగాణను ఇవ్వకుండా టిడిపిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా విపక్షమైన టిడిపి వైఖరి చెప్పాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తమది ప్రజల మనోభావాలను గౌరవించే పార్టీ అన్నారు. చంద్రబాబు గురువారం 14.3 కిలోమీటర్ల దూరం నడిచారు. అవినీతికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాంది పలికాడని ఆరోపించారు.

ఒకరిద్దరు ఎమ్మెల్యేలున్న పార్టీలు కూడా పత్రికలను, చానళ్లను పెడుతున్నాయన్నారు. తటస్థంగా ఉన్నవాళ్లు పత్రికలు, చానళ్లు పెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోరన్నారు. కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోరని, ఇస్త్రీ నలగని దుస్తులతో ఫ్రెష్‌గా తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు.

English summary
TD chief Nara Chandrababu Naidu on Thursday alleged that the Congress had hatched a conspiracy against his party under the guise of the All Party Meeting on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X