తెరాస తిరకాసు పార్టీ, వైయస్ అల్లుడికి...: బాబు

తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడబోనని ఆయన అన్నారు. అయితే, కొన్ని పార్టీలు తామ పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజకీయాలను స్వార్థానికి వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
పతి రైతుల సమస్యలను ప్రభుత్వం వారం రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే జమ్మికుంటలో తాను మహాధర్నా చేపడతానని ఆయన హెచ్చరించారు. పత్తికి మద్దతు ధర రూ. 4 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేసి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు.
ముస్లిం తాము వచ్చే ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని ఆయన చెప్పారు. రైతుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన తీరును గుర్తుకు తెస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications