తెరాస అవకాశవాదం, కాంగ్రెసు కుట్రల పార్టీ: బాబు

తమ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెసు చూస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, మంత్రులు గానీ గ్రామాల్లోని కనీస సమస్యలు కూడా పరిష్కరించడంలేదని విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరిస్తామంటే వెటకారం చేస్తున్నారని, తమని విమర్శించే హక్కు ముఖ్యమంత్రికి లేదని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర 73వ రోజైన సోమవారం కరీంనగర్ జిల్లాలో కొొనసాగింది. కాగా జిల్లాలో మూడో రోజు యాత్ర జగిత్యాల నియోజక వర్గం, రాయికల్ మండలం, ఇటిక్యాల నుంచి చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. అందరినీ విమర్శించడం తప్ప ముఖ్యమంత్రి ప్రజలకు చేసేది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు.
ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. దేశమంతా తిరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని అంటున్నారని, ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వమని, దద్దమ్మ ప్రబుత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ళయినా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు.
పత్తి రైతులు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో ఆధార్‌కార్డుల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండడంవల్ల కేంద్ర ప్రభుత్వం తలపెట్టన నగదు బదిలీ రసాభాస అయ్యే అవకాశం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications