టైం అడిగిన సిబిఐ: జగన్ బెయిల్ విచారణ వాయిదా

జగన్ ఆస్తుల జఫ్తుపై విచారణ 26కు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడి జఫ్తు కేసు విచారణను పిఎంఎల్ అథారిడి ఈ నెల 26కు వాయిదా వేసింది. ఆ లోగా ఈడి జఫ్తు చేసిన ఆస్తులపై కౌంటర్ దాఖలు చేయాలని జగతి పబ్లికేషన్, జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నెల 19వ తేదికి వాయిదా వేసింది. జగన్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టాట్యూటరీ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లకు దరఖాస్తు చేసుకోగా అక్కడ చుక్కెదురు కావడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
గాలి శ్రీనివాస్ రెడ్డి
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నాడు.












Click it and Unblock the Notifications