షర్మిల మోకాలికి పెద్దగాయం, ఆపరేషన్: 3వారాలు రెస్ట్

అయితే సోమవారం కూడా కాలు యాత్రకు సహకరించలేదు. దీంతో వైద్యులు ఆమెకు ఉదయం పరీక్షలు జరిపారు. షర్మిల మోకాలికి గాయం పెద్దగా ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె మోకాలికి బుధవారం కీహోల్ ఆపరేషన్ చేయనున్నారు. మోకాలికి కీహోల్ ఆపరేషన్ జరగనున్న దృష్ట్యా ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మూడు వారాలు బ్రేక్ రానుంది.
ఆపరేషన్ తర్వాత రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఎమ్మార్ స్కాన్‌లో ఆమెకు పెద్ద గాయం ఉన్నట్లుగా తేలింది. షర్మిలకు గాయం తీవ్రమైందని, కీహోల్ ఆపరేషన్ అవసరమని డాక్టర్ సోమశేఖర రెడ్డి చెప్పారు. వాహనం పైనుండి పడటంతో మోకాలికి గాయమైంది. కాగా ఆమెకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో లేదా హైదరాబాద్ నగరంలోని మరో ప్రముఖ ఆసుపత్రిలో కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications