హంతుకులే సంతాపాలు: కాంగ్రెసు నివాళిపై కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: కాంగ్రెసు విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ అమర వీరులకు పార్టీ నివాళులు అర్పించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తీవ్ర వ్యాఖ్య చేశారు. కాంగ్రెసు పార్టీ బలవంతపు నివాళుల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అమర వీరులకు కాంగ్రెసు నివాళులు హంతకులే సంతాపం తెలిపినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

పిసిసి రాష్ట్ర స్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు నివాళి కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన అడిగారు. అలాంటి పార్టీలో కొనసాగాల్సిన పరిస్థితి తెలంగాణ నేతలకు ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండో తరగతి పౌరులుగా సీమాంధ్రుల కింద గులాంగిరీ చేస్తున్నందుకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హంతకులే సంతాపాలు ప్రకటిస్తే అమరుల ఆత్మ క్షోభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే తప్ప కాంగ్రెసును, ఆ పార్టీ నాయకులను ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు.

ఆదివారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పొన్నం ప్రభాకర్ నీలం తుఫాను మృతులకు, తెలంగాణ అమర వీరులకు నిలబడి నివాళులు అర్పించాలని చేసిన డిమాండ్ తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గొడవను చల్లార్చడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని సూచించడంతో సభ నివాళులు అర్పించింది. ఈ తీరుపై కెటిఆర్ సోమవారం మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+