జగన్ ఫోన్ పాలిటిక్స్‌పై యనమల: సిఎంకు 'చిరు' చిక్కు

Chiranjeevi-YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే రాజకీయాలు చేస్తున్నారన్న కేంద్రమంత్రి చిరంజీవి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెసు పార్టీ మేధోమధన సదస్సులో జగన్‌ను ఉద్దేశించి చిరంజీవి జైలు నుండి సెల్ ఫోన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

దీనిపై టిడిపి సోమవారం స్పందించింది. ప్రభుత్వం సహకారంతో జైలు నుండి జగన్ అన్ని రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తే ఎందుకు ఖండించలేక పోతున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి లేఖలు రాశారు. గత ఏడాది నుండి ఇదే విషయమై తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.

చంచల్‌గూడ జైలులో ఇలాంటివి జరుగుతున్నాయని తాము మొదటి నుండి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జగన్‌కు అన్ని సహకారాలు అందుతున్నాయన్న సంగతి చిరంజీవి వ్యాఖ్యల ద్వారా తెలిసిందని ఆయన అన్నారు.

తక్షణమే జగన్ ఉన్న జైలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని యమనల డిమాండ్ చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, కాంగ్రెసు నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. చిరంజీవి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+