ఎగ్జిట్ పోల్ సర్వేలు: ముచ్చటగా మూడోసారీ మోడీదే

తుది విడత రెండో దశ పోలింగ్ గుజరాత్‌లో సోమవారం ముగిసింది. రెండో దశలో 60 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 95 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండు దశల్లోనూ భారీ పోలింగు నమోదైంది. గుజరాత్ శాసనసభలో మొత్తం 182 శాసనసభా స్థానాలున్నాయి. సి - వోటర్ బిజెపికి 124 స్థానాలు లభిస్తాయని అంచనా వేస్తుండగా చాణక్య 140 స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. అయితే, ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు 120 నుంచి 124 స్థానాలు రావచ్చునని అంచనా వేస్తున్నాయి.
బిజెపికి 124 స్థానాలు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతోంది. టౌమ్స్ నౌ అంచనా 120 సీట్లు. నీల్సన్ సర్వే 124 స్థానాలు బిజెపికి దక్కుతాయని అంచనా వేసింది. ఎన్డీటివి 120 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బిజెపిని ధిక్కరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న కేశూభాయ్ పటేల్‌కు తీవ్ర నిరాశ ఎదురవుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఆయనకు ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నాయి.
కాంగ్రెసుకు 50 నుంచి 53 స్థానాలు దక్కే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. కాగా, 41 శాతం మంది నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. మొత్తం మీద, అభివృద్ధి మంత్రంతో నరేంద్ర మోడీ మూడోసారి గుజరాత్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో బిజెపి నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు మరింతగా ముందుకు రావచ్చు.












Click it and Unblock the Notifications