నిషాన్‌లో నరేంద్రమోడీ ఓటు: విక్టరీ సింబల్‌తో బయటకు

మోడీని చూసేందుకు ఎగబడ్డారు. ఓటు వేసిన అనంతరం విక్టరీ సింబల్‌ను చూపిస్తూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరు కోట్ల మంది గుజరాతీల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. గుజరాత్ అభివృద్ధి చెందితే తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బిజెపిదే హ్యాట్రిక్ అన్నారు. గుజరాత్ కోసం తాను చిత్తశుద్ధితో అంకితమై ఉన్నానని, ప్రభుత్వం అభివృద్ధే ఎజెండాగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లు చెప్పారు.
ఈ ఎన్నికల్లో మరోసారి బిజెపిని గెలిపించి మూడోసారి అధికారాన్ని ఓటర్లు ఇస్తారని, అందుకు తాను ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోడీ అన్నారు. ప్రజలు మరోసారి బిజెపికే ఓటు వేస్తున్నారన్నారు. పాలననే ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచారం చేసిందని, ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. 3డి పరిజ్ఞానంతో ప్రచారం మర్చిపోలేనిదన్నారు. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications