బయటకొచ్చేది లేదంటే మాట్లాడరేం?: తెలంగాణపై బాబు

తెలంగాణపై నేనిచ్చిన లేఖ కేంద్రప్రభుత్వం వద్దే ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని, దీన్ని రాజకీయం చేయొద్దన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని, తెలుగుదేశంపై బురదజల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. మమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారన్నారు. 2008లోనే తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామన్నారు. ఇక్కడ తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్య తేల్చడం లేదన్నారు. పనికిమాలిన ముఖ్యమంత్రి ఎక్కడా కనపడడని.. పత్తి, పసుపు, వరి, చెరుకు రైతులు మద్దతు ధరలు లభించక ఇబ్బందులు పడుతుంటే విశాఖకు వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెరాస కిరికిరి పార్టీ అని, అది వాస్తవాలు చెప్పదని, రాజకీయ లబ్ధి గురించే ఆలోచిస్తుందని విమర్శించారు. అతి త్వరలోనే ఉద్యోగుల కోసం ఒక పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications