వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ అంటే డీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2012వ సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. తెలంగాణ, వైయస్ జగన్ అంశాల చుట్టూనే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలు తిరిగాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత తన కుటుంబాన్ని, తనను కాంగ్రెసు పార్టీ అధిష్టానం వేధిస్తోందని ఆరోపిస్తూ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరిట గత ఏడాది కొత్త కుంపటి పెట్టుకున్నారు. ఆయన ఆస్తులపై దర్యాఫ్తు జరుపుతున్న సిబిఐ మే 27వ తేదిన ఆయనను అరెస్టు చేసింది.

జగన్ బెయిల్ కోసం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ప్రయత్నించినప్పటికీ చుక్కెదురవుతూనే ఉంది. జగన్ అరెస్టులో తమ ప్రమేయం లేదని కాంగ్రెసు చెబుతుండగా.. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కై జగన్‌ను జైలులో పెట్టించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. జైలుకు వెళ్లక ముందు, వెళ్లిన తర్వాత జగన్ సీమాంధ్రలో చాలామంది నేతలను ప్రభావితం చేశారు.

కాంగ్రెసు, టిడిపిల నుండి పలువురు ప్రజాప్రతినిధులు ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు...అవుతున్నారు. ఇటీవల తెలంగాణపైనా దృష్టి సారించారు. జగన్ పార్టీని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహాలు రచిస్తున్నాడు. జగన్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. రెండుసార్లు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ హవానే కొనసాగింది.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

ఆస్తుల కేసులో మే 27న సిబిఐ జగన్‌ను అరెస్టు చేసింది.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

జగన్, ఎమ్మార్, ఓఎంసి ఆస్తుల కేసులలో సిబిఐ పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఆస్తులను అటాచ్ చేసింది. ఈడి కూడా ఆస్తులను అటాచ్ చేసింది.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

జగన్ బెయిల్ కోసం నాంపల్లి సిబిఐ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ప్రయత్నించి విఫలమయ్యారు.

 ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో పెట్టే అంశం ఆ కుటుంబంలో చిచ్చు రాజేసింది.

 ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

పిఆర్పీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడం, దాసరికి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవడం, చిరు కేంద్రమంత్రి కావడం, దాసరిపై చిరు తనయుడు రామ్ చరణ్ తేజ పరోక్ష వ్యాఖ్యలు... ఇలా పలు అంశాలు చిరు, దాసరి మధ్య ఉన్న విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయి.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

అన్న కోసం, పార్టీ పటిష్టత కోసం షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. అయితే వారం రోజుల క్రితం మోకాలి నొప్పి కావడంతో ఆపరేషన్ అయింది. దీంతో మూడు వారాలు రెస్టు తీసుకుంటున్నారు.

 ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

చంద్రబాబు పాదయాత్రలో నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై జరుగుతున్న చర్చకు తెరపడింది.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

పోలవరం టెండర్లు తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు కొన్ని రోజులు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. పాత వాటిని రద్దు చేశారు. కొత్తగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు. ఇది రాయపాటిది అని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో పదవి రానందుకే పోలవరం టెండర్లు కట్టబెట్టారని వారు ఆరోపిస్తున్నారు.

 ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. బాలయ్య గుడివాడలో నానిపై తొడ కొట్టారు. నాని కూడా ధీటుగానే స్పందించారు.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. ఆయనను గెలిపించుకుంటామని హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.

 ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు, తెరాస హవా కొనసాగింది.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

పాలమూరులో బిజెపి, పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు తెరాసకు షాక్ ఇచ్చింది.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

బైరెడ్డి రాజశేఖర రెడ్డి సీమవాదం ఎత్తుకున్నారు.

 ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలు రాజ్యసభలో ఎప్‌డిఐ ఓటింగు సమయంలో గైర్హాజరై టిడిపిని ఇబ్బందుల్లోకి నెట్టారు.

ఇయర్‌వ్యూ: జగన్ అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఢీ

మహేష్ బాబును మంత్రి గల్లా అరుణ కుమారి రాజకీయాల్లోకి తీసుకు వస్తారనే ప్రచారం జరిగింది. దానిని ఆమె కొట్టి పారేశారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో తెరాస హవా కొనసాగింది. పాలమూరులో తెరాసకు బిజెపి గట్టి షాక్ ఇచ్చింది. పరకాల ఎన్నికల్లో తెరాసకు వైయస్సార్ కాంగ్రెసు ముచ్చెమటలు పట్టించింది. ఈ సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఒక్క చోట కూడా గెలవలేక పోయింది. కాంగ్రెసు కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సొంత నియోజకవర్గాల్లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితితో ప్రారంభమైన ఈ ఏడాది ఇప్పుడు ఆ నేతలు స్వేచ్ఛగా తిరిగే స్థితికి వచ్చింది.

దీనికి తెలంగాణవాదం తగ్గడం కాదు. నివురుగప్పిన నిప్పులా మాత్రమే ఉంది. కేంద్రం తెలంగాణను ప్రకటించకుండా ఉండేందుకు సమైక్యవాదులు కూడా వ్యూహరచనలు చేస్తున్నారు. తెలంగావాదంతో పాటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి నేతలు సీమవాదాన్ని బలంగా లేవనెత్తుతున్నారు. జగన్ జైలుకు వెళ్లడంతో షర్మిల పార్టీ కోసం ఇంటి బయట అడుగు పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటేసిన వైయస్సార్ కాంగ్రెసు.. ఎఫ్‌డిఏ ఎన్నికల్లో భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పైన కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది. ఎప్‌డిఐ ఓటింగు సమయంలో రాజ్యసభలో టిడిపి ఎంపీలు ముగ్గురు గైర్హాజరు కావడం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. పలువురు టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు జగన్ వైపు వెళ్లారు. అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం అయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ మారటం చర్చనీయాంశమయింది.

కొడాలి నానికి బాలయ్య గుడివాడకు వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. నాని కూడా ఘాటుగానే స్పందించారు. జగన్ కేసుకు సంబంధించి సిబిఐ, ఈడి పలు ఆస్తులను అటాచ్ చేసింది. ఓఎంసి కేసులో, సత్యం కేసులో కూడా ఈడి భారీ మొత్తంలో ఆస్తుల అటాచ్‌మెంట్ చేసింది. వీటిలో కొన్నింటిలో ఆయా కొన్నింటిలో కొందరికి ఊరట లభించింది. పోలవరం టెండర్లు కూడా హీటెక్కించాయి. పోలవరం టెండర్ల అంశం కెసిఆర్‌ని ఊపిరాడకుండా చేసింది.

అయితే ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. ఇటీవల మరో కంపెనీకి కట్టబెట్టారు. అవి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు కంపెనీ అని ఆరోపణల వస్తున్నాయి. ఆయన మాత్రం తనకు సంబంధం లేదంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంవత్సరారంభంలో చిరంజీవి, బాలకృష్ణల మధ్య మాటల యుద్ధం నడిచింది.

మంత్రి గల్లా అరుణ కుమారి ప్రిన్స్ మహేష్ బాబును రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె వాటిని కొట్టి పారేశారు. సిబిఐ తమ ఛార్జీషీట్లలో జగన్, ఎమ్మార్, ఓఎంసి కేసులలో భారీ అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలు దోచుకున్నట్లుగా ఆరోపించింది. సినీ స్టార్స్ కృష్ణం రాజు, శ్రీహరిలు తాము రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. బాలకృష్ణ 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు.

నారా లోకేష్, షర్మిలలు టిడిపికి, వైయస్సార్ కాంగ్రెసుకు ప్రధాన ఆకర్షణగా ఈ సంవత్సరం మారారు. లోకేష్ రాజకీయ ఆరంగేట్రం ఇప్పుడు కాకపోయినా త్వరలో వస్తాడని ఈ సంవత్సరం డిసైడ్ అయిపోయింది. ఇంటి బయట కాలు పెట్టిన షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మరో పవర్ సెంటర్‌గా మారనున్నారని, టిడిపిలో బాలకృష్ణ మరో పవర్ సెంటర్‌గా మారనున్నట్లుగా వార్తలు వచ్చాయి.

పిఆర్పీని చిరు కాంగ్రెసులో విలీనం చేశారు. అయితే చాలా రోజుల తర్వాత గత నెలలో ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది. దాసరి నారాయణ రావు స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో దాసరి, మోహన్ బాబులు అసంతృప్తికి గురయ్యారని వార్తలొచ్చాయి. వారిద్దరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లుగా ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం పార్లమెంటులో పెట్టేందుకు అనుమతి రాగానే నందమూరి కుటుంబంలో కొత్త చిచ్చు రాజుకుంది. ఎవరికి వారు ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇది మొదట పురంధేశ్వర్ - బాబుల మధ్య ప్రారంభమైనా చంద్రబాబు, హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వర రావు, ఎన్టీఆర్ పెద్ద తనయుడు, లక్ష్మీపార్వతి వరకు వెళ్లింది. అలాగే ఎన్టీఆర్ ఇంటిని కూల్చివేయడంపై లక్ష్మీ పార్వతి మండిపడింది.

English summary

 Late Nandamuri Taraka Rama Rao statues issue created tension in Nandamuri family in this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X