వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఆల్‌పార్టీ: జగన్ పార్టీ నుండి మైసూరా, కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

MP Mysoora Reddy and KK Mahender Reddy
హైదరాబాద్: ఈ నెల 28న జరగనున్న అఖిల పక్ష సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున సీమాంధ్ర ప్రాంతం నుండి మైసూరా రెడ్డి, తెలంగాణ ప్రాంతం నుండి కెకె మహేందర్ రెడ్డిలు వెళ్లనున్నారు. గురువారం అఖిల పక్షానికి పంపాల్సిన అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. మైసూరా రెడ్డి ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కెకె మహేందర్ రెడ్డి కేంద్రపాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. మైసూరా, మహేందర్ రెడ్డిలు వెళ్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఇదే ఆఖరి అఖిల పక్షం కావాలి

తెలంగాణపై ఇదే ఆఖరి అఖిల పక్షం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. విభజనపై స్పష్టమైన వైఖరి రావాల్సిందే అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రకు కూడా అన్యాయం జరుగుతోందని హరిబాబు అన్నారు. ఆంధ్రా ప్రాంతానికి న్యాయం జరగాలన్నా విభజనే అందుకు సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసు మంత్రులే టార్గెట్

తెలంగాణపై అఖిల పక్ష సమావేశంల అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి గురువారం అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పని పక్షంలో తెలంగాణ మంత్రులనే టార్గెట్ చేస్తామన ఆయన హెచ్చరించారు.

ఎవరి మనోభావాలు దెబ్బతినవద్దు

ఎవరి మనోభావాలు దెబ్బతికుండా నిర్ణయం తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాగా ఢిల్లీలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణవాదులనే అఖిల పక్ష సమావేశానికి పంపించాలని వారు డిమాండ్ చేశారు.

English summary

 former MP Mysoora Reddy and KK Mahender Reddy will going to all party meet on Friday from YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X