అఖిలపక్షం: ఏయే పార్టీ నుండి ఎవరు, ఏం చెప్తారు!?

అధికారంలో ఉన్న కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ పార్టీలకు పిలుపు అందింది. ఆయా పార్టీలు అఖిల పక్ష సమావేశానికి పంపించాల్సిన ప్రతినిధుల పేర్లను ప్రకటించాయి. తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పాలని అటు సమైక్యాంధ్ర జెఏసి, ఇటు తెలంగాణ జెఏసి డిమాండ్ చేస్తున్నాయి.
సమైక్యవాదం వినిపించాలని సమైక్యాంధ్ర జెఏసి, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు, తెలంగాణవాదం వినిపించాలని తెలంగాణ జెఏసి, తెలంగాణ ప్రాంత నేతలు ఆయా పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలు తమ వైఖరిని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు చెప్పేందుకు సిద్ధమయ్యాయి. ఆయా పార్టీల నుండి కేంద్రం ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశానికి వెళ్లనున్న ప్రతినిధుల వివరాలు ఇలా ఉన్నాయి....
బిజెపి - కిషన్ రెడ్డి, హరిబాబు - తెలంగాణకు అనుకూలం
తెరాస - కె చంద్రశేఖర రావు, నాయిని నర్సింహా రెడ్డి - తెలంగాణకు అనుకూలం
సిపిఐ - నారాయణ, గుండా మల్లేష్ - తెలంగాణకు అనుకూలం
సిపిఎం - రాఘవులు, జూలకంటి రంగారెడ్డి - సమైక్యమే అయినా కేంద్రంపై మొగ్గు
మజ్లిస్ - అసదుద్దీన్ ఓవైసీ, జివిజి నాయుడు - సమైక్యం లేదా రాయల తెలంగాణ లేదా కేంద్రంపై నిర్ణయం
తెలుగుదేశం - యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి - తెలంగాణకు అనుకూలంగా చెప్పే అవకాశం, 2008 నాటి లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పే అవకాశం
వైయస్సార్ కాంగ్రెసు - మైసూరా రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి - కేంద్రంపై భారం
కాంగ్రెసు - గాదె వెంకట రెడ్డి, సురేష్ రెడ్డి - ఎవరి అభిప్రాయం వారు వినిపించే అవకాశం
కాగా కాంగ్రెసు మినహా అన్ని పార్టీలు తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయనున్నాయి. కేంద్రం నిర్ణయం కోసం పట్టుబట్టనున్నాయి. కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు ఎవరికి వారు అభిప్రాయం వినిపించినా అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications