జైపాల్‌రెడ్డి రాజీనామాకు సిద్ధం: గుత్తా, జగన్ పార్టీ గో.పి.

aipal Reddy
హైదరాబాద్: కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించని పక్షంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం అన్నారు. తెలంగాణ విషయంలో జైపాల్ రెడ్డి అన్ని రకాలుగా సహకరిస్తున్నారని, తమతోపాటు ఆయన కూడా పదవుల్లో కొనసాగబోరని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తప్ప మరో మార్గం లేదన్నారు.

నెల రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌కు కష్టమని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పామని, తమ దారి తాము చూసుకుంటామని చెప్పామన్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభించకపోతే జైపాల్‌ రెడ్డి కూడా మంత్రి పదవిలో కొనసాగే అవకాశం లేదన్నారు. సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బిజెపి మాదిరిగా టిడిపి కూడా తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్నారు.

తొలిసారిగా అఖిలపక్ష భేటీలో పాల్గొనే అవకాశం వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవకాశాన్ని జార విడుచుకుందన్నారు. గోడ మీద పిల్లి వాటంలా చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం పేర లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావులు విద్యార్థులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. దోచుకునే వారే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.

మంత్రి పదవి రాకపోయేసరికి ఉద్యమాన్ని కావూరి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. తెలంగాణను ప్రకటిస్తే రాజీనామా చేస్తానని చెబుతోన్న మంత్రి గంటా శ్రీనివాస రావుకు.. సామాజిక తెలంగాణను ఏర్పాటు చేస్తామంటూ అప్పటి పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించినప్పుడు ఏమయిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే పిఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని చిరంజీవి చెప్పారని, ఇప్పుడు సామాజిక తెలంగాణను ఏర్పాటు చేసే విషయంలోనూ చిరంజీవి కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

గోడ మీద పిల్లిలాగా ఏదైనా పార్టీ ఉందంటే అది కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలు జోకర్లంటూ వ్యాఖ్యానించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అసలు తెలంగాణలో పుట్టిన బిడ్డలెవరూ సమైక్యాంధ్ర పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండరన్నారు. అవినీతి పార్టీలో ఉండొద్దని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+