ఫిర్యాదు కోసం వస్తే లోబర్చుకున్న కానిస్టేబుల్, కేసు

పెనమలూరు సిఐ ధర్మేంద్ర కథనం ప్రకారం... ఐదేళ్ల కిందట వివాహమైన మహిళ, భర్తతో మనస్పర్థల వల్ల అతనితో విడిపోయి మరో వ్యక్తిని పెళ్లాడింది. అయితే, వారిద్దరి మధ్య కూడా పొరపొచ్చాలు రాగా రెండో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. తన ఫిర్యాదుకు సంబంధించి తరచూ స్టేషన్‌కు వస్తున్న ఆమెను ఈస్ట్‌జోన్ సిసిఎస్ విభాగం కానిస్టేబుల్ వీర వెంకట్రావ్ గమనించాడు.
ఆమెకు మాయమాటలు చెప్పి కంకిపాడులోని ఓ మహిళా హోంగార్డు నివాసంలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో ఆమెను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో మంగళగిరి మేయర్స్ హోమ్‌లో చేరింది. రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో తిరిగి పుట్టింటికి చేరింది. ఆ తర్వాత అత్యాచారం చేసిన కానిస్టేబుల్ వద్ద కొచ్చి తనను భార్యగా స్వీకరించాలని కోరింది.
అందుకు అతడు నిరాకరించడంతో నగర పోలీసు కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు సిఐ ధర్మేంద్ర బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications