ఖబర్దార్ కెసిఆర్! ఉరికించి తరిమేస్తాం: ఎర్రబెల్లి వార్నింగ్

Errabelli Dayakar Ra - Kadiyam Srihari
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వారు తమ పార్టీ జెండాలను గానీ, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను గానీ దగ్ధం చేస్తే ఉరికించి మరీ తరిమి కొడతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టి-టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వైఖరి తెలంగాణపై స్పష్టంగా ఉందన్నారు. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటే ఊరుకునే సమస్యే లేదన్నారు.

తెరాస రాజకీయ సమాధి కాక తప్పదన్నారు. టిడిపి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తెరాస ఉనికి కోల్పోతుందన్నారు. ఖబర్దార్ కెసిఆర్ అని మండిపడ్డారు. సెంటిమెంటు పేరుతో తెలంగాణ ప్రజలను పన్నెండేళ్లు మోసం చేశావని, ప్రజలను, యువతను రెచ్చగొట్టి కెసిఆర్ కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని ధ్వజమెత్తారు. సెంటిమెంటు పేరుతో ఇంకా మోసం చేస్తే ఊరుకునే సమస్యే లేదన్నారు.

టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం రోజు కెసిఆర్ అసలు తెలంగాణ బందుకు ఎందుకు పిలుపునిచ్చారో చెప్పాలన్నారు. అఖిల పక్ష భేటీలో టిడిపి వైఖరిని తెలంగాణవాదులు స్వాగతిస్తే కెసిఆర్ విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే కెసిఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు.

తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖ కాదు, అఖిల పక్షంలో ఇచ్చిందే ఆఖరిది, అదే మా విధానమని చెప్పారు. తెలంగాణపై టిడిపి స్పష్టమైన వైఖరితో ఉన్నప్పటికీ తమను కెసిఆర్ ప్రశ్నించడమేమిటని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణను తేల్చాల్సిన ప్లేసులో ఉన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని అతను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కెసిఆర్ కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+