టిడిపి కార్యాలయానికి టులెట్ బోర్డు: లోకేష్ పైన ధ్వజం

సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని నినాదాలు చేశారు. విశాఖలోని టిడిపి జిల్లా కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టి తమ నిరసనను తెలియజేశారు. చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ద్రోహి అని ధ్వజమెత్తారు. ఆయన చేపడుతున్న వస్తున్నా మీకోసం పాదయాత్రను సీమాంధ్ర జిల్లాల్లో అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. బాబు తనయుడు నారా లోకేష్ పైన ధ్వజమెత్తారు. లోకేష్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాగా టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అడారి కిషోర్ ఇప్పటికే ప్రకటించారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా తాను పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో టిడిపి వ్యవహరించిన తారు మనస్తాపం కలిగించిందన్నారు.
ఇకపై పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్‌గా ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారని మండిపడ్డారు. సమైక్యవాదానికి మద్దతు తెలిపే అందరినీ కలుపుకు పోతామన్నారు. త్వరలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications