మాలో ఏకాభిప్రాయంలేదు: గాదె, షిండే వ్యాఖ్యపై సవాల్

Gade Venkat Reddy
హైదరాబాద్: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తి లేదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి సోమవారం అన్నారు. గాంధీ భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అఖిల పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తనను మాట్లాడవివ్వలేదన్నది కేవలం దుష్ప్రచారమే అన్నారు. తాము రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామని కూడా షిండే అఖిల పక్ష సమావేశంలో చెప్పలేదన్నారు.

అలా చెప్పినట్లు ఎవరైనా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను ఎప్పుడూ సమైక్యగళమే విప్పుతున్నానన్నారు. అఖిల పక్షంలోనూ సమైక్యవాదం వినిపించానన్నారు. తమ పార్టీకి చెందిన నేత సురేష్ రెడ్డి తెలంగాణవాదం వినిపించారన్నారు. తెలంగాణపై తమ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు. తాను గతంలో అదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు.

తాను సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. పార్టీలో ఒకే అభిప్రాయం ఉండేందుకు మాతి ఉప ప్రాంతీయ పార్టీ కాదన్నారు. తెలుగుదేశం, సిపిఐలది తెలంగాణపై రాజకీయ అవకాశవాదమని విమర్శించారు. అఖిల పక్షంలో విభజన మంచిది కాదన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యాఖ్యలను తాను ఉటంకించానని చెప్పారు.

కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతాయన్నారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని గాదె వెంకట రెడ్డి అన్నారు.

రాజీనామాలు అవసరం లేదు

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రాన్ని కేంద్రం విడగొట్టదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం రాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+