పివితో అనుబంధం నెమరేసుకున్నకిరణ్: ప్రణబ్ షాపింగ్

తన తండ్రి పివి నరసింహా రావుకు విశ్వాసపాత్రుడు అన్నారు. తన తండ్రి చనిపోతే పివి చేతులతో మోశారని తెలియజేశారు. ప్రేమించే వారి కోసం పివి ఏమైనా చేస్తాడని చెప్పేందుకే తాను ఆయనకు తన కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించానన్నారు. ఆర్థిక సంస్కరణలు ఆయన వల్లే సాధ్యమయ్యాయన్నారు. పివితో పది నిమిషాలు మాట్లాడితే పది సంవత్సరాల రాజకీయ అనుభవం వచ్చేస్తుందన్నారు.
ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో భారత్ మాత్రం నిలదొక్కుకుందంటే పివి ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమన్నారు. దేశ అభివృద్ధికి పివి నరసింహా రావు ఎంతో చేశారన్నారు. ఏకకాలంలో పలు పనులు చేయగల్గిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. మాట్లాడుతుండగా ఏదైనా ఆలోచన వస్తే కంప్యూటర్‌లో టైప్ చేసి వచ్చేవారన్నారు. మాట్లాడుతూనే ఆలోచనలు చేసేవారన్నారు.
పివి నరసింహా రావు అపార అనుభవం గల మేధావి అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతే మేలు చేశాయన్నారు. కాగా పివి స్మారక సమావేశం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాదులోని ఆబిడ్స్‌లో కాసేపు షాపింగ్ చేశారు.












Click it and Unblock the Notifications