వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ పండితులే ఆశ్చర్యపోయారు: పివిపై ప్రణబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: ప్రస్తుత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా ఎంచుకొని రాజకీయపండితులు ఆశ్చర్యపోయేలా దివంగత ప్రధానమంత్రి పివి నరసింహా రావు చేశారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం కొనియాడారు. పివి స్మారక సమావేశం జూబ్లీహాలులో ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రణబ్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ప్రణబ్ మాట్లాడుతూ... రాజకీయ సాంప్రదాయాల్ని కాదని అప్పుడు పివి మన్మోహన్‌ను ఆర్థికమంత్రిని చేశారన్నారు. పివి గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అన్నారు. దేశ అభివృద్ధిలో, కాంగ్రెసును గట్టెక్కించడంలో పివిది కీలక పాత్ర అన్నారు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం తనకు రావడం గర్వంగా ఉందన్నారు. పివి రాజకీయ చతురుడు, బహుముఖ ప్రజ్ఞశాలి, విదేశీ విధానాన్ని మలుపు తిప్పిన మేధావి అని అన్నారు.

క్లిష్ట సమస్యలకు స్పష్టమైన పరిష్కార మార్గాలు సూచించిన వ్యక్తి అన్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో పివి తెగువ ప్రదర్శించారని, దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేశారన్నారు. కాంగ్రెసు డాక్యుమెంటరీని పివినే రూపొందించారన్నారు. పివి సేవలు విస్మరించలేనివని, భారతమాత గర్వించదగ్గ నేత అన్నారు. 1970 నుండి పివితో తనకు పరిచయం ఉందని, అప్పుడు తాను ఇందిర కేబినెట్లో జూనియర్‌ను అన్నారు.

పివి వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అపార అవగాహన కలిగిన మేధావి అన్నారు. పివి నరసింహ రావుతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధముందని చెప్పారు. పివి వంటి వారి వల్లనే ఆర్థిక సంస్కరణలు సాధ్యమయ్యాయన్నారు. దేశంలో రెండో తరం ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో ఆయన పాత్ర కీలకం అన్నారు.

English summary
President Pranab Mukherjee said on Monday late PV Narasimha Rao is great son of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X